V6 News

డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు, ఆర్టీసీ జేఏసీతో కొలిక్కి వచ్చిన పోలీసుల మంతనాలు

డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు, ఆర్టీసీ జేఏసీతో కొలిక్కి వచ్చిన పోలీసుల మంతనాలు

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ అంత్యక్రియల విషయంలో ప్రతిష్టంభన తొలగిపోయింది. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు, ఆర్టీసీ జేఏసీతో పోలీసుల మంతనాలు కొలిక్కి వచ్చాయి. శుక్రవారం (ఏప్రిల్ 24) పోలీసులు జరిపిన చర్చల కారణంగా.. అంత్యక్రియలు జరిపేందుకు శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు అంగీకరించారు. 

డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో తమకు న్యాయం జరగేదాక కదిలేది లేదని అంత్యక్రియలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అంతిమయాత్ర కొనసాగించేందుకు నిరాకరించడంతో పోలీసులు మంతనాలు జరిపారు. సమయం మించిపోవడంతో పోలీసుల సూచనల మేరకు  అంతిమ యాత్రను కొనసాగించేందుకు శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. 

►ALSO READ | ముత్తోజిపేటలో టెన్షన్: నర్సంపేట డిపోలో నివాళుల అంశంపై కొలిక్కిరాని చర్చలు

శంకర్ గౌడ్ అంత్యక్రియలు జరిపేందుకు ఆర్టీసీ జేఏసీ నాయకులు, కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. అంతకు ముందు శంకర్ గౌడ్ కుటుంబాన్ని కలిసేందుకు వరంగల్ జిల్లా ముత్తోజిపేటకు కేంద్రమంత్రి బండి సంజయ్ వచ్చారు. కుటుంబ సభ్యులకు మద్ధతుగా ధర్నాకు దిగారు. అయితే అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, జేఏసీ నేతలు ఒప్పుకోవడంతో బండి సంజయ్ అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఆర్టీసీ జేఏసీ, శంకర్ గౌడ్ కుటుంబ సభ్యుల నిర్ణయమే ఫైనల్ అని ప్రకటించారు. అంత్యక్రియలకు ఓకే చెప్పడంతో ముత్తోజిపేట నుంచి బండి సంజయ్, బీజేపీ శ్రేణులు వెళ్లిపోయాయి. 

అంతకు ముందు శంకర్ గౌడ్ అంత్యక్రియలు పూర్తి చేసేలా జేఏసీ నేతలు చొరవ చూపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల రూపాయల సహాయం, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని అంతకు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే.