డ్రంక్ అండ్ డ్రైవ్‌తో తాటతీస్తున్న పోలీసులు.. ఒకే రోజు 168 మంది పట్టివేత

డ్రంక్ అండ్ డ్రైవ్‌తో తాటతీస్తున్న పోలీసులు.. ఒకే రోజు 168 మంది పట్టివేత

హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 168 మంది మందుబాబులను సైబరాబాద్ పోలీసులు ఆదివారం(జూలై 7) పట్టుకున్నారు. వారిలో 134 మంది బైకర్లు కాగా, 14 మంది ఆటో డ్రైవర్లు, 19 మంది ఫోర్ వీలర్ డ్రైవర్లు, 1 హెవీ వెహికల్ డ్రైవర్ ఉన్నారు. పట్టుబడిన మందుబాబుల్లో 26 మంది 200 mg/100 ml నుండి 550 mg/100 ml వరకు బ్లడ్ ఆల్కహాల్ గాఢత (BAC) స్థాయిలను కలిగి ఉండటం గమనార్హం.

అంతకుముందు, జూలై 27న శనివారం రాత్రి సైబరాబాద్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్‌ టెస్టులు నిర్వహించారు. ఈ చర్యల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 262 మంది డ్రైవర్లను పట్టుకున్నారు. ఇందులో 191 మంది టూ వీలర్ నడుపుతున్న వారు కాగా, 11 మంది ఆటో డ్రైవర్లు, 56 మంది ఫోర్ వీలర్ డ్రైవర్లు, 4 హెవీ వెహికల్ డ్రైవర్లు ఉన్నారు.

385 మంది..

జూన్ 22న రాత్రి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇదే తరహాలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 385 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో 292 మంది బైక్ రైడర్లు, 80 మంది ఫోర్ వీలర్ డ్రైవర్లు, 11 మంది త్రీ వీలర్ డ్రైవర్లు, ఇద్దరు హెవీ వెహికల్ డ్రైవర్లు ఉన్నారు.  పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్‌ టెస్టులు నిర్వహిస్తున్నా.. పట్టుబడిన వారిపై చర్యలు తీసుకుంటున్నా.. మందుబాబుల్లో మాత్రం మార్పు  రావడం లేదు. జరిమానా లేదా కౌన్సిలింగ్‌తో బయటపడతామనే నమ్మకంతో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారు.