ఎమ్మెల్యే రాజాసింగ్ షాక్..శోభాయాత్రకు అనుమతి నిరాకరణ

ఎమ్మెల్యే రాజాసింగ్ షాక్..శోభాయాత్రకు అనుమతి నిరాకరణ

బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా ఆకాష్ పురి హనుమాన్ టెంపుల్ నుంచి హనుమాన్ వ్యయామశాల వరకు రాజసింగ్ నిర్వహించనున్న శోభాయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎలక్షన్ కోడ్ ఉండటంతో అనుమతి నిరాకరించారు పోలీసులు.

ప్రతీ ఏడాది ఆకాష్ పురి టెంపుల్ నుండి ఎమ్మెల్యే రాజసింగ్ శోభాయాత్ర నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే శోభాయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు.  ఈ క్రమంలో శోభాయాత్రకు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు రాజాసింగ్. ఈ మార్గాల్లో వెళితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందన్న పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో పోలీసులు సూచించిన మార్గాల్లోనే శోభాయాత్ర నిర్వహించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

శోభయాత్రకు అనుమతివ్వకపోవడంతో పోలీసులపై రాజసింగ్ ఫైరయ్యారు. అనుమతి లేకున్నా కచ్చితంగా శోభాయాత్ర నిర్వహిస్తామని రాజాసింగ్ అంటున్నారు. భారీ సంఖ్యలో రామభక్తులు శోభాయాత్రలో పాల్గొంటారని.. ఏవైనా అనుకోని ఘటనలు జరిగితే పోలీసులే బాధ్యత వహించాలని రాజాసింగ్ అన్నారు.