
- డీజీపీ రవిగుప్తకు పోలీసు అధికారుల సంఘం వినతిపత్రం
హైదరాబాద్, వెలుగు : పోలీసుల సమస్యల్ని పరిష్కరించి వారి కుటుంబాల సంక్షేమానికి కృషి చేయాలని పోలీసు అధికారుల సంఘం విజ్ఞప్తి చేసింది. పోలీసుల పిల్లలకు మెరుగైన విద్య కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తామని, హోంగార్డు ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఆరోగ్య భద్రత కల్పిస్తామని సీఎం హామీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. సోమవారం డీజీపీ రవి గుప్తను పోలీసు సంఘం అధికారులు కలిశారు. వారు మాట్లాడుతూ.. పెండింగ్‌లోని మూడు డీఏలు, మూడు సరెండర్లు, పీఆర్‌సీ ఏరియర్స్, జీపీఎఫ్, మెడికల్ బిల్లులు, టీఏలను ఇప్పించాలని కోరారు.
ఆరోగ్య భద్రత బిల్లులు పెండింగ్‌లను చెల్లించాలని సూచించారు. వారాంతపు సెలవులు, కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు ఎస్ఐ అయ్యేలాగా సంస్కరణలు తేవాలని కోరారు. పోలీసు ఉద్యోగులకు, హోంగార్డులకు ఇంటి స్థలాలు మంజూరు చేయించాలని, అడిషనల్ హెచ్ఎస్ఏ, రేషన్, కిట్, రిస్క్ , డ్రైవర్, ట్రైనింగ్ సెంటర్స్ అలవెన్సు, అంత్యక్రియల ఖర్చుల జీవోలను ఇప్పించాలని కోరారు.