తీన్మార్ మల్లన్న అరెస్ట్

తీన్మార్ మల్లన్న అరెస్ట్

హైదరాబాద్ : తీన్మార్ మల్లన్నను పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. మార్చి 21వ తేదీ మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో 20 మంది పోలీసులు ఫిర్జాదిగుడాలోని మల్లన్న Q న్యూస్ ఆఫీస్ లో సోదాలు చేస్తున్నారు. మల్లన్న ఆఫీస్ లో పని చేస్తున్న సిబ్బందిని బయటకు పంపించారు. ప్రస్తుతం Q న్యూస్ ఆఫీస్ లోకి ఎవరిని అనుమతించడం లేదు.

రెండు రోజుల క్రితం తీన్మార్ మల్లన్న కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేసి.. విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడలో ఉన్న తీన్మార్ మల్లన్నకు సంబంధించిన క్యూ న్యూస్ ఆఫీసుపై ఆదివారం మధ్యాహ్నం దాదాపు 20 మందికిపైగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడి ఘటనపై మేడిపల్లి పోలీసులకు తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. తాను బయటకు వెళ్లిన సమయంలో వచ్చి తన కార్యాలయంపై దాడి చేశారని మల్లన్న తెలిపారు. 

గతంలో సైతం క్యూ న్యూస్ ఆఫీసుపై దాడులు చేసిన వారిని ఇప్పటికీ ఒక్కర్ని కూడా పోలీసులు పట్టుకోలేదని తీన్మార్ మల్లన్న తెలిపారు. చాలాసార్లు క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి జరిగినా.. వార్తలు ఆగలేదన్నారు.