
హైదరాబాద్: అబిడ్స్ లో ఉన్న సంతోష్ దాబాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 8 మంది వ్యాపారవేత్తలను అరెస్ట్ చేశారు. గురువారం విశ్వసనీయ సమాచారం మేరకు అబిడ్స్ లోని సంతోష్ దాబాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో సంతోష్ దాబా ఓనర్, మయూర్ పాన్ షాప్ ఓనర్ తో పాటు ఆరుగురు వ్యాపార వేత్తలు ఉన్నారు. బేగంబజార్ నివాసి సత్యప్రకాష్, బహద్దూర్‌పురాకు చెందిన నౌషాద్ అలీ, ఓల్డ్ తోప్‌ఖానాకు చెందిన పుష్పక్ జైన్, గ్యాన్ బాగ్ కు చెందిన రాజ్‌కుమార్, రాంకపోట్‌కు చెందిన అలోక్ జైన్, బర్కత్ పుర నివాసి పురుషోత్తంలను పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.73,860 నగదును , సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆపరేషన్ రైడ్ నిర్వహించారు.