తీన్మార్ మల్లన్న ఆఫీసులో పోలీసుల సోదాలు

తీన్మార్ మల్లన్న ఆఫీసులో పోలీసుల సోదాలు

10 కంప్యూటర్లు, 15 హార్డ్ డిస్క్ లు, బుక్స్ స్వాధీనం 
మేడిపల్లి, వెలుగు: క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న ఆఫీసులో మరోసారి సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. క్యూ న్యూస్ ఆఫీసుపై పోలీసులు దాడులు చేయడం ఇది మూడో సారి. సోమవారం సాయంత్రం ఆఫీసుకు చేరుకున్న పోలీసులు అత్యంత పకడ్బందీగా సోదాలు చేశారు. వందల సంఖ్యలో మఫ్టీలో వచ్చిన పోలీసులు ఆఫీసులోని10 కంప్యూటర్లు, 15 హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు, పుస్తకాలు తీసుకు వెళ్లినట్లు తెలిసింది. తనను డబ్బులు డిమాండ్ చేశాడంటూ జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్ శర్మ పెట్టిన కేసులో అరెస్ట్ అయిన మల్లన్న ఆగస్టు 27 నుంచి జైలులో ఉన్నారు. శనివారం నుంచి మల్లన్నను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అప్పగించింది. ఈ కేసులో శుక్రవారం అంబర్ పేట శంకర్​ను కూడా పోలీసులు విచారించారు. మల్లన్నకు కరోనా ట్రీట్​మెంట్​ చేసిన పీర్జాదిగూడ కెనరా నగర్ సమీపంలోని ప్రజా క్లినిక్ నిర్వాహకుడు డాక్టర్ విక్టరీ ఇమ్మాన్యుయేల్​నూ పోలీసులు సీక్రెట్​గా ప్రశ్నించి, వివరాలు సేకరించినట్లు తెలిసింది.