హోళీ పండగపై పోలీసుల ఆంక్షలు

హోళీ పండగపై పోలీసుల ఆంక్షలు

రెండు రోజుల్లో హోళీ పండగ జరగనుంది. యువత హోళీ వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో పోలీసులు హోళీ పండగపై ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌లో హోళీ వేడుకలకు అనుమతిలేదని పోలీసులు అంటున్నారు. అదేవిధంగా పార్కులు, కాలనీల్లో కూడా హోళీ ఈవెంట్లకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో కోవిడ్ కేసులు మళ్లీ విజృంభిస్తుండడంతో ఈ ఆంక్షలను అమలుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఉల్లంఘనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలలో జరిగే వేడుకలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే ఈవెంట్స్ ఆర్గనైజర్లను, హాస్టళ్ల నిర్వాహకులను హెచ్చరించారు. హోళీ ఆడేవాళ్లందరూ ఖచ్చితంగా మాస్క్‌లు పెట్టుకొని సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు.