గుర్తు తెలియని వ్యక్తులు ఓటీపీ అడిగితే చెప్పొద్దు: పోలీసులు

గుర్తు తెలియని వ్యక్తులు ఓటీపీ అడిగితే చెప్పొద్దు: పోలీసులు

ఓటీపీని ఎవరికీ చెప్పొద్దని.. ఫోన్ కాల్స్, టెక్స్ట్​ మెసేజ్​, ఇ–మెయిల్స్ ద్వారా ఓటీపీని షేర్ చేయడం ద్వారా చాలామంది మోసపోతున్నారని పోలీసులు తెలిపారు. 

ఆరు గ్యారెంటీలు అప్లై చేసిన వారికి సైబర్ క్రైమ్ పోలీసులు పలు సూచనలు చేశారు. గ్యారంటీల పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందంటూ.. పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేశారు. ప్రజలంతా ఈ విషయంపై అలర్ట్ గా ఉండాలని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ అడిగితే.. చెప్పొద్దంటూ పోలీసులు పేర్కొన్నారు.  ఓటీపీ వివరాలు చెప్తే మోసపోతారన్నారు. 

సీజన్ ను బట్టి సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త మోసాలకు తెరలేపుతుంటారని వివరించారు. దరఖాసుదారులకు ప్రభుత్వ నుంచి ఎలాంటి OTP లు రావు కాబట్టి.. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.