న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్​లు క్లోజ్

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్​లు క్లోజ్

హైదరాబాద్, వెలుగు: న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు 3 కమిషనరేట్ల పరిధిలోని ఫ్లై ఓవర్లు, అండర్ పాస్​లను  క్లోజ్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌పై ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. ట్రావెల్ చేసే వారి వద్ద ఫ్లైట్‌‌ టికెట్స్‌‌ తప్పనిసరిగా ఉండాలి. 

పీవీ ఎక్స్​ప్రెస్ హైవే, లంగర్‌‌‌‌ హౌస్‌‌  ఫ్లై ఓవర్‌‌‌‌, బేగంపేట్‌‌ ఫ్లై ఓవర్ మినహా సిటీలోని అన్ని ఫ్లై ఓవర్లను మూసివేస్తారు. ట్యాంక్‌‌బండ్‌‌, ఎన్టీఆర్‌‌‌‌మార్గ్‌‌, నెక్లెస్‌‌రోడ్​తో పాటు దుర్గం చెరువు కేబుల్‌‌బ్రిడ్జిని  క్లోజ్‌‌ చేయనున్నారు. పీవీఎన్ఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్‌‌బండ్‌‌, ఎన్టీఆర్‌‌‌‌ మార్గ్‌‌లో ఆదివారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఆంక్షలు విధించారు. ఈ టైమ్​లో వెహికల్స్ ను అనుమతించరు. ఈ రూట్‌‌లో ప్రయాణించే వాహనదారులు ఇతర మార్గాల్లో ట్రావెల్ చేయాలని పోలీసులు తెలిపారు.