
జీడిమెట్ల, వెలుగు: దూలపల్లి ఇండస్ట్రియల్ఏరియాలోని ప్లాట్ నం.125లోని శ్రీజగదాంబ కెమికల్స్గోడౌన్ లో భారీగా స్పిరిట్ నిల్వచేశారని ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. గురువారం రైడ్ చేసి 105 డ్రమ్ముల్లో 21 వేల లీటర్ల స్పిరిట్ ను పట్టుకున్నారు. దీని విలువ మార్కెట్ లో రూ.2.31కోట్లు ఉంటుందని తెలిపారు. నిర్వాహకులు హనుమాన్ రామ్సేన్, శ్రవణ్ కుమార్ ను అరెస్టు చేసి, గోడౌన్ ను సీజ్ చేశారు.