
కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలో 280 కిలోల గంజాయి పట్టుబడింది. విమానాశ్రయం సమీపంలోని పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న 280 కిలోల గంజాయిని వారు స్వాధీనం చేసుకున్నారు. టెంపో బస్సులో 240 కిలోలు, ఆర్టీసీ బస్సులో 40 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ఒక మహిళతో సహా 12 మంది నిందితులను అరెస్ట్ చేసి, గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు.