
అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. రాజస్థాన్ కు చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తి బైక్ పై 45 లక్షల 90 వేల రూపాయల హవాలా డబ్బును తీసుకొని కస్టమర్ కు అందించేందుకు అబిడ్స్ లోని తాజ్ మహల్ హోటల్ కు వచ్చాడు. ఈ క్రమంలో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సమాచారం అందుకుని అక్కడికి చేరుకుని మనోజ్ ను అదుపులోకి తీసుకొని డబ్బును సీజ్ చేశారు. హవాలా డబ్బును కలెక్ట్ చేసుకునేందుకు వచ్చిన సయ్యద్ రహీముద్దీన్ , మహమ్మద్ జకీర్ హుసైన్ లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బుతో పాటుగా వారిని అబిడ్స్ పోలీసులకు అప్పగించారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో భారీగా నగదు పట్టుబడుతుంది.