పబ్ లో మూడు టేబుల్స్ పై డ్రగ్స్!

పబ్ లో మూడు టేబుల్స్ పై డ్రగ్స్!
  • కేక్​ కట్​​ చేసిన చోట అనుమానిత పౌడర్​ గుర్తింపు
  • అక్కడే డ్రగ్స్​ తీసుకున్నట్టుగా పోలీసుల అనుమానం
  • ఆ టేబుల్స్​ బుక్​ చేసిన వారి డేటా సేకరించే ప్రయత్నం
  • సీసీటీవీ ఫుటేజ్‌‌, కస్టమర్ల లిస్ట్‌‌ ఆధారంగా దర్యాప్తు
  • కాల్‌‌ డేటా, వాట్సప్ చాటింగ్స్ వివరాల సేకరణకు యత్నాలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ ఫుడ్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ మింక్ పబ్ డ్రగ్స్​ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పబ్​లోని మూడు టేబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డే పార్టీలు జరిగినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. కేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన చోట్ల అనుమానిత పౌడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గుర్తించారు. అక్కడే డ్రగ్స్ తీసుకున్నట్టు అనుమానిస్తున్నారు. ఈ టేబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన వారి డేటా కలెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. 125 మందిలో ఈ మూడు టేబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద బర్త్​డే సెలబ్రేషన్స్ చేసుకున్న వారిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. గోడల నుంచి సేకరించిన పౌడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డ్రగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నట్లు గుర్తించారు. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్ ఆధారంగా డ్రగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే వివరాలు సేకరిస్తున్నారు. పబ్​ మేనేజర్​ అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద స్వాధీనం చేసుకున్న 4.64 గ్రాముల కొకైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే వివరాలు రాబడుతున్నారు. పబ్​ కేసు దర్యాప్తుపై వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీసీపీ జోయల్ డెవిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంగళవారం రివ్యూ నిర్వహించారు. ఫుడ్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్​ మింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై శనివారం రాత్రి టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ పోలీసులు రెయిడ్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉప్పలను అరెస్ట్ చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. పరారీలో ఉన్న అర్జున్ వీరమాచినేని, కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజు గురించి గాలింపు కొనసాగిస్తున్నారు. విచారణకు 2 స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు. పబ్‌కు రెగ్యులర్‌గా వచ్చే​ కస్టమర్ల డేటాను పోలీసులు సేకరిస్తున్నారు. 

ల్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐప్యాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేటా రిట్రివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పబ్​ పార్ట్​నర్​ అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉప్పల కాంటాక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు. అభిషేక్ ఉప్పల నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెండు సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐప్యాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సిటీ సైబర్ క్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపించారు. అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి తెలుసుకున్న పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా డేటాను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీటిలో ఒక్కటి మాత్రమే ఓపెన్ అయ్యింది. మరో మూడు డివైజెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లాక్స్ ఉన్నట్లు తెలిసింది. వీటిని కూడా రిట్రీవ్ చేసేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. డిలీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన డేటాను రికవరీ చేయనున్నారు. వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాటింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంటాక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో శనివారం రాత్రి పార్టీకి వచ్చిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు సంబంధించిన కస్టడీ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుధవారం విచారణకు రానుంది. కాగా, పబ్​ కేసులో దర్యాప్తు కీలక దశలో ఉందని, నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తామని, టెక్నికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నామని, దర్యాప్తు ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని హైదరాబాద్​ సీపీ సీవీ ఆనంద్​ చెప్పారు.

డ్రగ్​ పెడ్లర్​ లక్ష్మీపతి అరెస్ట్

వాంటెడ్ డ్రగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెడ్లర్ లక్ష్మీపతి(28)ని సిటీ నార్కొటిక్స్ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అదుపులోకి తీసుకుంది. ఏపీ, గోవాల్లో వారం రోజులుగా అతడి కోసం గాలించింది. డ్రగ్స్ కస్టమర్లు, సప్లయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధారంగా లక్షీపతిని ట్రేస్ చేసింది. గోవాలో అతడిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించింది. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బానిసైన ఓ యువకుడు(19) గత నెల 29న మృతిచెందిన సంగతి తెలిసిందే. స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డ్రగ్స్, హాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ప్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉపాధ్యాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్చి 31న నార్కొటిక్స్ వింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరెస్ట్ చేసింది. ప్రేమ్​ ఉపాధ్యాయ్​తో కలిసి లక్ష్మీపతి డ్రగ్స్​ సప్లయ్​ చేసినట్టు గుర్తించిన పోలీసులు అతడి కోసం సెర్చ్ మొదలుపెట్టారు. లక్ష్మీపతిపై డ్రగ్స్​కు సంబంధించి ఇప్పటికే నాలుగు కేసులున్నాయి.