అసలు హార్డ్ డిస్క్ నా దగ్గరే ఉంది

అసలు హార్డ్ డిస్క్ నా దగ్గరే ఉంది

అసలు  హార్డ్ డిస్క్  తన  దగ్గరే ఉందన్నారు తీన్మార్ మల్లన్న. మంగళవారం రాత్రి తన ఆఫీసులో రెండు గంటలు నిర్భంధించి హార్డ్ డిస్కులు తీసుకెళ్లారన్నారు. కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యే ల అక్రమాలు హార్డ్ డిస్క్ లో ఉన్నాయనుకుని ఎత్తుకెళ్లారన్నారు. అయితే  వాళ్ళ బండారం డిస్కుల్లో ఉన్నమాట వాస్తమే కానీ పోలీసులు ఎత్తుకు పోయిన హార్డ్ డిస్కుల్లో లేదన్నారు. కేసీఆర్  అవినీతి బాగోతం మొత్తం తన వద్ద ఉందని.. వారికి బుద్ది చెప్పేందుకు సిద్దమవుతున్నామన్నారు. ఆగస్టు 29న కేసీఆర్ ను మన కోర్టులోకి తెస్తామన్నారు.

గంగుల కమలాకర్ గ్రానైట్ రాయి, మైహోమ్ రామేశ్వరరావు సిమెంటుతో కేసీఆర్ కు రాజకీయ సమాధి కడతానన్నారు. పాస్ పోర్ట్ బ్రోకర్ కేసీఆర్ అని..హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య అందాలన్నారు. రాజకీయం చేసేందుకు తీన్మార్ మల్లన్న టీం పని చేయబోదన్నారు. తాము రాజకీయం చేస్తే కేసీఆర్ సచ్చినంత ఒట్టన్నారు.

చదువు రానోల్లు మన మంత్రులుగా ఉన్నారని.. పదవ తరగతి చదువుకున్న సబిత ఇంద్రారెడ్డి డిగ్రీ విద్యార్థులకు మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. చింతమడక వద్ద ఉన్న పెద్ద రావి చెట్టును ఈ మధ్యే కొట్టేశారన్నారు.  ఎందుకు కొట్టేశారు అని అడిగితే రోడ్డు విస్తరిస్తరణలో భాగంగా కొట్టేశారని చెప్పారు..కానీ అసలు సంగతి ఏంటంటే కేసీఆర్ ను కట్టేసి కొట్టిన రావి చెట్టును కొట్టేశారన్నారు.