
బండి సంజయ్ అరెస్ట్ పై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బండి సంజయ్ అరెస్ట్ పై లోక్ సభకు సమాచారం ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతును నొక్కుతున్నారని మండిపడ్డారు. సంజయ్ అరెస్ట్ పై రాజకీయ, న్యాయపోరాటలు కొనసాగుతాయని చెప్పారు. మరోవైపు బీజేపీ ఎంపీలు ఏప్రిల్ 5 న లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కలిశారు. ఈ వ్యవహారంపై వారు ప్రివిలైజ్ నోటీసులు ఇచ్చారు.
టెన్త్ క్లాస్ పేపర్ కాపీయింగ్ కేసులో ఆరెస్ట్ అయిన బండి సంజయ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో బీజేపీ లీగల్ సెల్ హైకోర్టును ఆశ్రయించింది. ఆయనకు బెయిల్ మంజారు చేయాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖాలు చేసింది. ఈ పిటిషన్ రేపు మద్యాహ్నం విచారణకు రానుంది. సంజయ్ ను పోలీసులు ఖమ్మం జైలుకు తరలించారు.