తీన్మార్ మల్లన్న పోల్పై నేతల ఆగ్రహం

తీన్మార్ మల్లన్న పోల్పై నేతల ఆగ్రహం

పిల్లలను బాడీ షేమ్ చేయడం సరికాదు..

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షును ఉద్దేశిస్తూ బీజేపీ నేత తీన్మార్ మల్లన్న యూట్యూబ్ లో నిర్వహించిన పోల్ ను వైఎస్సాఆర్  తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖండించారు. పిల్లల్ని వేధించడం, కుటుంబసభ్యులపై ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని తల్లిగా, రాజకీయ పార్టీ నాయకురాలిగా ఖండిస్తున్నానని ట్వీట్ చేశారు. మహిళల్ని కించపరచడం, పిల్లలను బాడీ షేమ్ చేయడం తీవ్రమైన విషయాలని, ఇలాంటి వాటిపై అందరూ రాజకీయాలకు అతీతంగా పోరాడాలని షర్మిల పిలుపునిచ్చారు.

తీన్మార్ మల్లన్న పోల్పై కేటీఆర్ సోదరి, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. 'నీ ప్రతిష్టను దిగజార్చేందుకు వాళ్ల దగ్గర కారణాలు లేనప్పుడు నీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటారు. సోషల్ మీడియా వేదికల మీద కనీసం సున్నితంగా, బాధ్యతగా ఉండటం మాత్రమే మనం చేయగలిగింది. చాలా కాలంగా సోషల్ మీడియా ద్వారా విద్వేషాన్ని, అబద్దాలను వ్యాప్తి చేస్తున్నవారు సిగ్గుపడాలి'ని కవిత ట్వీట్ చేశారు. 

సోషల్ మీడియాలో కేటీఆర్ కొడుకును బాడీ షేమింగ్ చేస్తూ తీన్మార్ మల్లన్న పోస్టు పెట్టడాన్ని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా ఖండించారు. ఇలాంటి పోల్ లు పెట్టడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అన్నారు. రాజకీయ పార్టీలు ప్రత్యర్థుల విధానాలను వ్యతిరేకించాలే తప్ప వారిపై, వారి కుటుంబసభ్యుల ఆహార్యంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. తెలంగాణలో ఇలాంటి పరిస్థితి తలెత్తేందుకు టీఆర్ఎస్ కూడా కారణమని ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తల కోసం...

యూఎస్, యూరప్ లలో డెల్మిక్రాన్ భయం

16 రాష్ట్రాలు బ్యాన్ చేసిన వ్యక్తిని తెలంగాణకు ఆహ్వానిస్తారా?