యూఎస్, యూరప్ లలో డెల్మిక్రాన్ భయం

యూఎస్, యూరప్ లలో డెల్మిక్రాన్ భయం

న్యూ ఢిల్లీ: ఇప్పటికే ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు వణికిస్తుంటే.. ఆ రెండూ కలిసి డెల్మిక్రాన్ డబుల్ వేరియంట్ గా మారి యూఎస్, యూరప్ దేశాలకు దడ పుట్టిస్తున్నది. రెండు వేరియంట్ల స్పైక్ ప్రొటీన్ల మ్యుటేషన్లతో ఏర్పడిన డెల్మిక్రాన్.. చాపకింద నీళ్లలా వ్యాపిస్తోందని ఎక్స్​పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా, బ్రిటన్ దేశాలలో కేసులు విపరీతంగా పెరగడానికి ఇదే కారణమని అనుమానిస్తున్నారు. 

ఏమిటీ డెల్మిక్రాన్? 
డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ రెండింటినీ కలిపి డెల్మిక్రాన్ అని పిలుస్తున్నారు. ఇది కొత్త వేరియంట్ కాకపోయినప్పటికీ.. డెల్టా, ఒమిక్రాన్ రెండింటి స్పైక్ ప్రొటీన్లు కలవడం వల్లే ఏర్పడుతుందని చెప్తున్నారు. అంటే, ఒక వ్యక్తికి ఒకే సమయంలో డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ రెండూ సోకితే ఏర్పడేదే డెల్మిక్రాన్ అన్నమాట. ఇది ఒమిక్రాన్ కంటే ఎక్కువ స్పీడ్ గా విస్తరిస్తోందని అంచనా వేస్తున్నారు. ఆ కారణంగానే యూరప్ దేశాల్లో రోజుకు లక్షల్లో కేసులు పెరుగుతున్నాయని అనుమానిస్తున్నారు. 

దీని లక్షణాలేంటి?
డెల్టా, ఒమిక్రాన్, డెల్మిక్రాన్ ఈ మూడింటిలో ఏది సోకినా వ్యాధి లక్షణాలు కొంచెం అటూఇటుగా ఒకేరకంగా ఉండటంతో డెల్మిక్రాన్ ప్రభావం ఎంతో ఇప్పుడే అంచనా వేయలేకపోతున్నారు. డెల్మిక్రాన్ అంటితే మాత్రం ఆగకుండా దగ్గు, తీవ్రంగా జ్వరం, వాసన కోల్పోవడం, తలనొప్పి, ముక్కు కారుతూనే ఉండటం వంటి లక్షణాలుంటాయని చెప్తున్నారు.  

మనదేశంలో డెల్మిక్రాన్ ప్రభావమెంత?
ఇప్పటివరకు దేశంలో ఒమిక్రాన్ కేసులు 400 దాటినయ్. డెల్టా వేరియంట్ సోకినవాళ్లకు కలిగే వ్యాధులతో పోలిస్తే ఒమిక్రాన్ ఎఫెక్ట్ కాస్త తక్కువగానే ఉంటోంది. ఆస్పత్రుల్లో చేరేవాళ్ల సంఖ్యా తక్కువే ఉంటోంది. అయితే, కాస్త ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నోళ్లకు, ఇదివరకే రోగాలున్నోళ్లకు ఈ రెండు వేరియంట్లు ఒకే సారి సోకితే మాత్రం ఇన్​ఫెక్షన్ ముప్పు ఎక్కువే ఉండొచ్చని ఎక్స్​పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. కాబట్టి, కచ్చితంగా కరోనా గైడ్​లైన్స్ పాటించడం ఒక్కటే మార్గమని చెప్తున్నారు.

400 దాటిన ఒమిక్రాన్ కేసులు
దేశంలో ఒమిక్రాన్ కేసులు వరుసగా రెండోరోజు వందకుపైనే నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి వరకు మొత్తం 403 కేసులు రికార్డ్ అయ్యాయి. మహారాష్ట్రలో కొత్తగా 20 మందికి కొత్త వేరియంట్ కన్ఫమ్ కావడంతో కేసులు 108కి పెరిగాయి. కేరళలో 8 మందికి, గుజరాత్ లో 13 మందికి ఒమిక్రాన్ సోకింది. అయితే, గడిచిన 24 గంటల్లో 122 ఒమిక్రాన్ కేసులు రికార్డయ్యాయని శుక్రవారం ఉదయం హెల్త్ మినిస్ట్రీ చెప్పింది. ఈ వైరస్‌ నుంచి కోలుకున్న, వలసపోయిన వారి సంఖ్య 114కు చేరిందని తెలిపింది. దేశంలోని 17 రాష్ట్రాలు, యూటీల్లో ఒమిక్రాన్ కేసులు రికార్డయినట్టు చూపించింది. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 108 , ఢిల్లీలో 67, తెలంగాణలో 38, తమిళనాడులో 34, కర్నాటకలో 31, గుజరాత్‌లో 43 ఒమిక్రాన్ కేసులు రికార్డయ్యాయి. 

కొత్తగా 6 వేల కేసులు.. 
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,650 మందికి వైరస్ పాజిటివ్ వచ్చిందని హెల్త్ మినిస్ట్రీ చెప్పింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,47,72,626కు పెరిగిందని తెలిపింది. వైరస్‌తో 374 మంది మృతిచెందారని, దీంతో మరణాల సంఖ్య 4,79,133కు చేరిందని పేర్కొంది. 

టీకాలతోనే సరిపోదు.. జాగ్రత్తలు తప్పనిసరి: కేంద్రం 
దేశవ్యాప్తంగా నమోదవుతున్న ప్రతి 10 ఒమిక్రాన్ బాధితుల్లో 9 మంది టీకాలు తీసుకున్న వాళ్లే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. టీకాలు వేసుకున్నంత మాత్రాన ఒమిక్రాన్ ముప్పు తొలగిపోదని, అందరూ విధిగా మాస్కులు పెట్టుకుంటూ, ఇతర జాగ్రత్తలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. కరోనా ఫోర్త్‌‌‌‌‌‌‌‌ వేవ్‌‌‌‌‌‌‌‌ను ప్రపంచంలోని చాలా దేశాలు ఎదుర్కొంటున్నాయని, ప్రజలంతా అలర్ట్‌‌‌‌‌‌‌‌గా ఉండాలని చెప్పింది. కరోనా జాగ్రత్తలు పాటించడంలో అలసత్వం వద్దని హెల్త్‌‌‌‌‌‌‌‌ మినిస్ట్రీ శుక్రవారం పేర్కొంది. ‘‘డెల్టా కంటే ఒమిక్రాన్‌‌‌‌‌‌‌‌కు స్పీడ్‌‌‌‌‌‌‌‌గా వ్యాపించే లక్షణం ఉందని వరల్డ్‌‌‌‌‌‌‌‌ హెల్త్ ఆర్గనైజేషన్ డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 7న చెప్పింది. 1.53 రోజుల్లోనే కేసులు డబుల్ అవుతాయని తెలిపింది. కాబట్టి మనం కరోనా రూల్స్‌‌‌‌‌‌‌‌ను ఫాలో అవుతూ, జాగ్రత్తగా ఉండాలె’’ అని యూనియన్ హెల్త్ సెక్రెటరీ రాజేశ్ భూషణ్‌‌‌‌‌‌‌‌ వివరించారు. ఒమిక్రాన్ కు ట్రీట్ మెంట్ మల్టీ విటమిన్, పారాసిటమాల్ గోలీలే ఒమిక్రాన్ పేషెంట్లకు మల్టీ విటమిన్, పారాసిటమాల్ ట్యాబ్లెట్లతోనే ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేశామని ఢిల్లీలోని లోక్‌‌‌‌‌‌‌‌ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ (ఎల్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌జేపీ) హాస్పిటల్ శుక్రవారం వెల్లడించింది. ఎల్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌జేపీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటివరకు 40 మంది ఒమిక్రాన్ పేషెంట్లకు ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ చేశామని, వారిలో 19 మంది ఇప్పటికే డిశ్చార్జి అయ్యారని ఆస్పత్రి సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. 90 శాతం మంది అసింప్టమాటిక్‌‌‌‌‌‌‌‌ అని, మిగిలిన 1‌‌‌‌‌‌‌‌0 శాతం మందిలో జ్వరం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ‘‘పారాసిటమాల్‌‌‌‌‌‌‌‌, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు మాత్రమే పేషెంట్లకు ఇచ్చాం. వేరే మెడిసిన ఇవ్వాల్సిన అవసరం రాలేదు’’ అని డాక్టర్ చెప్పారు.