పంచ్ లు విసురుతున్న పొలిటికల్ లీడర్స్

పంచ్ లు విసురుతున్న పొలిటికల్ లీడర్స్
  • ‘ఫిర్‌ ఏక్ బార్‌ మోడీ’  ‘మై భీ చౌకీదార్‌’
  • ‘కారు, సారు..బేకారు’ అంటున్న కాంగ్రెస్‌_‘
  • ‘సారు, కారు.. పదహారు’ టీఆర్‌ఎస్‌ స్లోగన్‌_
  • ‘మీ భవిష్యత్తు.. నా బాధ్యత’ బాబు నినాదం
  • ‘రావాలి జగన్‌..కావాలి జగన్‌’ అంటున్న వైసీపీ

కేడర్ లో ఉత్సాహం నింపుతున్న డైలాగ్స్‌

హైదరాబాద్‌, వెలుగు: ప్రసంగంలో పంచ్ లుంటేనే కార్యకర్తల్లో జోష్‌ పెరుగుతుంది. టైమింగ్‌, రైమింగ్‌ ఉంటేనే ఉత్సాహం ఉరకలేస్తుం ది. చప్పగా సాగే ప్రసంగాన్ని బలవంతంగా వినే పరిస్థితులిప్పుడు లేవు.అందుకే పార్టీకో నినాదం పుట్టుకొచ్చింది.  ఢిల్లీ నేతలనుంచి గల్లీ నాయకుల వరకు వాటినే వాడేస్తున్నా రు. ఒక్కసారి వింటే గుర్తుండేలా ప్రతి పార్టీ ఓ స్లోగన్ తో జనంలోకి వెళుతోంది. నేతలు పబ్లిక్ లోకి దూసుకెళ్లే డైలాగ్స్ ను తయారు చేసుకున్నా రు. ‘ఫిర్‌ ఏక్ బార్‌ మోడీ’ నినాదంతో బీజేపీ ప్రచారం చేస్తుం డగా, ‘గరీబీహఠావో’ నినాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిం ది కాంగ్రెస్‌.

పాపులరైన ‘చౌకీదార్‌’

ఈ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ ఇచ్చిన ‘మై భీ చౌకీదార్‌’ నినాదం బాగా పాపులరైంది.బీజేపీ కార్యకర్తలు, నాయకులు కూడా తమ ఫేస్ బుక్‌,వాట్సాప్‌, ట్విటర్‌ ఖాతాలను ‘మై భీ చౌకీదార్‌’ అని మార్చేసుకున్నారు. అయితే  ఈ నినాదాన్ని ప్రతిపక్షాలు ఆయుధంగా మలుచుకున్నా యి. కాంగ్రెస్‌ ‘మై భీచౌకీదార్‌’కు ప్రతిగా ‘మై భీ బేరోజ్ గార్‌, చౌకీదార్‌ చోర్‌ హై’ అనే నినాదాలిచ్చిం ది.  చౌకీదార్లు పేదలకు అవసరం లేదని, అమీర్లకే అవసరమని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాం ధీ కౌంటర్ ఇచ్చారు. దేశానికి కావాల్సిం ది చౌకీదార్‌ కాదని, జిమ్మేదార్‌, ఇమాన్ దార్‌,దిల్ దార్‌’ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రాసతో కూడిన పదాలు వదులుతున్నా రు.

మన దగ్గర ‘కారు, 16’ పై సెటైర్లు

కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నా యని, రాష్ట్రంలో 16 సీట్లు గెలిపిస్తే అక్కడ చక్రం తిప్పబోయేది తామేనని సీఎం కేసీఆర్‌ ప్రచారం చేస్తున్నారు. ‘సారు.. కారు.. పదహారు..ఢిల్లీలో సర్కా రు’ అంటూ ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తన ప్రసంగంలో హోరెత్తిస్తున్నా రు. దీనికి విరుగుడుగా కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌, రేవంత్‌, దాసోజు శ్రవణ్ లు ‘కారు.. సారు.. బేకారు’ అంటూ కౌంటర్‌ ఇస్తున్నారు. దీనిపైనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌..‘బారు.. బీరు.. సర్కారు’ అంటూ ఎద్దేవా చేశారు.

ఏపీలో పోటాపోటీ

ఏపీలో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ‘జాబుకావాలంటే.. బాబు రావాలి’ అనే నినాదం టీడీపీని అధికారంలోకి తెచ్చింది. ఇప్పుడు ‘మీ భవిష్యత్తు .. నాబాధ్యత’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఇక వైసీపీ ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ నినాదాన్ని నమ్ముకుం ది. జగన్‌ తన ప్రసంగంలో ‘నేను విన్నాను .. నేనున్నాను ’.. అంటూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెం చుతున్నా రు. జనసేన అధినేత పవన్‌ కల్యాన్‌  ‘పాతిక కేజీల బియ్యం కాదు.. పాతికేళ్ల భవిష్యత్తు ‘ అనే నినాదంతో ముందుకెళ్తున్నారు