V6 News

రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ! : కేటీఆర్

రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ! : కేటీఆర్
  • బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జీవన్ రెడ్డి చేరికతో జగిత్యాలలో పండుగ వాతావరణం: కేటీఆర్
  •     కేసీఆర్ బయటకు వస్తుంటే గుంట నక్కలు భయపడ్తున్నయ్
  •     అటెన్షన్ డైవర్షన్ కోసమే సీఎం మేడిగడ్డ టూర్ అని విమర్శ

జగిత్యాల, వెలుగు: జీవన్ రెడ్డి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వీడి బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరడంతో రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ ప్రారంభమైందని, ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బలం మరింత పెరుగుతుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించే కేసీఆర్ బహిరంగ ప్రాంగణాన్ని శనివారం కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు పరిశీలించి, ఏర్పాట్లపై పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. అంతకు ముందు జీవన్ రెడ్డితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, దాదాపు ఏడాది తర్వాత కేసీఆర్ బయటకు వస్తుంటే గుంట నక్కలు భయపడుతున్నాయన్నారు. 

సభకు వచ్చే ప్రజలను అడ్డుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మీడియా దృష్టిని మళ్లించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, అదే రోజు మేడిగడ్డ సందర్శన పెట్టుకోవడం ఇందుకు నిదర్శనమన్నారు. రెండేండ్లుగా గుర్తుకురాని మేడిగడ్డ ఇప్పుడు ఎలా గుర్తుకు వచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రసంగం కోసం రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, భారీగా హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

డీలిమిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లింక్ పెట్టి మహిళలకు మోసం: హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు 

జీవన్ రెడ్డి చేరిక వల్ల ఉత్తర తెలంగాణలో పార్టీ మరింత బలోపేతమవుతుందని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు అన్నారు. ఆయన విలువలతో కూడిన రాజకీయ నాయకుడని చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని, డీలిమిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లింక్ పెట్టి మహిళలను మోసం చేసిందని ఆరోపించారు. 

కాంగ్రెస్, బీజేపీ కలిసి మహిళలకు అన్యాయం చేశాయని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ‘హైబ్రిడ్ రాజకీయాలు’చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పారు. ఓవైపు ఢిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశమవుతూ, మరోవైపు రాజకీయ విమర్శలు చేయడం రెండు పార్టీల మధ్య ఉన్న ‘బడే బాయ్ చోటే బాయ్’సంబంధానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.