రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఇయ్యాల్నే పోలింగ్

V6 Velugu Posted on Mar 14, 2021

  • ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 
  • హైదరాబాద్’ బరిలో 93, ‘వరంగల్’ పరిధిలో 71 మంది అభ్యర్థులు
  • న్యూస్ పేపర్ సైజ్లో బ్యాలెట్ పేపర్ 
  • మొదటి ప్రాధాన్యత ఓటు కంపల్సరీ
  • ఈ నెల 17న ఓట్ల లెక్కింపు

హైదరాబాద్ / నల్గొండ, వెలుగు: రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు భారీ స్థాయిలో ఉండటంతో బ్యాలెట్ పేపర్ న్యూస్పేపర్ సైజ్లో ఉండనుంది. హైదరాబాద్-రంగారెడ్డి-– మహబూబ్నగర్ నియోజకవర్గంలో  93 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వరంగల్–నల్గొండ– ఖమ్మం స్థానానికి 71 మంది పోటీ పడుతున్నారు. ఈ నెల 17న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 
‘హైదరాబాద్’ స్థానంలో ఇట్ల..
హైదరాబాద్–-- రంగారెడ్డి-–- మహబూబ్నగర్ నియోజకవర్గంలో మొత్తం 5,31,268 మంది ఓటర్లు ఉండగా, 799 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.  పోలింగ్ సిబ్బంది 3,835 మంది పాల్గొననున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు కలిపి 1,922 జంబో బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో  రెండు బాక్సులు ఉంచడంతో పాటు మరో 324 బాక్సులను అదనంగా ఉంచారు.ప్రతి పోలింగ్ స్టేషన్ లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. శనివారం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్లు, ఇతర పోలింగ్ సామగ్రిని పోలింగ్ ఆఫీసర్లకు అందజేశారు. ఆఫీసర్లు పోలీస్ బందోబస్త్ తో పోలింగ్ సెంటర్లకు చేరుకున్నారు.
‘వరంగల్’ స్థానంలో ఇట్ల..
‘వరంగల్’ నియోజకవర్గంలో 5,05,565 మంది ఓటర్లు ఉన్నారు. ఈ సెగ్మెంట్‌లో 12 జిల్లాలు ఉండటంతో  731 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో సిద్దిపేట జిల్లాలోని పలు మండలాలు కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో  2,924 మంది పోలిం గ్ సిబ్బంది డ్యూటీలో పాల్గొననున్నారు.  417 సెంటర్లలో వెబ్ కాస్టింగ్  
నిర్వహించనున్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున ప్రతి పీఎస్కు జంబో బ్యాలెట్ బాక్సులతో పాటు, బిగ్సైజ్ బ్యాలెట్ బాక్సులు కూడా అందజేశారు.
స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రత
పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు. అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ స్థానానికి సంబంధించిన బ్యాలెట్ బాక్సులను సరూర్ నగర్ స్టేడియానికి తరలిస్తారు. శనివారం ఈ స్టేడియాన్ని ఎన్నికల రిటర్నింగ్  ఆఫీసర్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ ప్రియాంక అలా ,  హైదరాబాద్ ఎన్నికల ఆఫీసర్ లోకేశ్కుమార్  పరిశీలించారు. వరంగల్–--నల్గొండ-–ఖమ్మం సీటుకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను నల్గొండ జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తారు. స్టేట్ వేర్హౌసింగ్ గోదాంలో రెండు స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు. 4 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో, సీఆర్పీఎఫ్  బలగాలను కాపలాగా పెట్టారు. 
పోస్టల్ బ్యాలెట్లు అందలే
ఎలక్షన్ డ్యూటీల్లో పాల్గొంటున్న ఆఫీసర్లు ఓటు వేయలేకపోతున్నారు. పీవో, ఏపీవో స్థాయి అఫీసర్లకు పోస్టల్ బ్యాలెట్లు అందినా.. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఇద్దరు చొప్పున డ్యూటీలో పాల్గొంటున్న ఇతర పోలింగ్ ఆఫీసర్లకు అందలేదు. పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లయ్ చేసుకున్నా రాలేదని ఎల్బీ స్టేడియంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు వచ్చిన కొందరు ఆఫీసర్లు అన్నారు. విషయాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ కోసం 768 మంది అప్లయ్ చేసుకోగా, అందులో 379 మంది పోస్టల్ బ్యాలెట్లను పొందారు. వీరిలో 158 మంది బ్యాలెట్ పేపర్లు అధికారులకు అందాయి.
మొదటి ప్రాధాన్యత నంబర్ తప్పనిసరిగా వేయాలి
రిటర్నింగ్ ఆఫీసర్ ప్రియాంక అలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు వేయాలని  ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ప్రియాంక అలా కోరారు. మొదటి ప్రాధాన్యత నెంబర్ (1) ను మాత్రం తప్పని సరిగా వేయాలన్నారు.  ఒక అంకెను ఒక అభ్యర్థికి మించి వేయకూడదని సూచించారు. అంకెలు వేయకుండా సంతకం చేసినా, వేలిముద్ర వేసినా, ఇతర మార్కులతో వేసినా, బ్యాలెట్ పేపర్ పై ఏదైనా రాసినా ఆ ఓటు చెల్లదని స్పష్టం చేశారు. బ్యాలెట్ లో నోటా కు అవకాశం లేదన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లయ్ చేసుకొని ఫామ్12 అందించిన ప్రతి ఒక్కరికీ పోస్టల్ బ్యాలెట్లను అందించామని, ఫామ్ 12 సమర్పించని వారికి పోస్టల్ బ్యాలెట్లు అందలేవని చెప్పారు. 
కరోనా రూల్స్ తప్పనిసరి ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు కరోనా రూల్స్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఓటర్ల టెంపరేచర్ను అక్కడి సిబ్బంది చెక్ చేస్తారు. వయొలెట్ కలర్ పెన్నుతోనే ఓటర్లు తమ ఓటు వేయాలి. ఓటు వేసిన వారికి ఎడమ చేయి చూపుడు వేలిపై సిరా గుర్తు వేస్తారు. 
ఎన్నికలు జరిగే జిల్లాల్లో..నేడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు బంద్
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఆదివారం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు భారీగా జరుగుతున్న నేపథ్యంలో ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని ఈ నెలలో రెండో శనివారంతోపాటు అన్ని ఆదివారాలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పని చేస్తాయని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న మేరకు ఆయా జిల్లాల్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పనిచేయవని, మిగతా జిల్లాల్లో పని చేస్తాయని పేర్కొంది.

Tagged TS, Today, Polling

Latest Videos

Subscribe Now

More News