న్యూఢిల్లీ : ఎయిర్ పొల్యూషన్లో డేంజర్ బెల్స్ మోగించే దేశ రాజధాని ఈసారి కొంత బెటర్ గా కన్పించింది. దీపావళి తర్వాత హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులకు చేరకుండా ఊపిరి పీల్చుకునేలానే నమోదైంది. నేషనల్ కాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) లో టపాసుల బ్యాన్, ఈసారి దీపావళి కాస్తా ముందు రావడం వంటి కారణాలతో ఆశించిన ఫలితాలు నమోదయ్యాయి. దీంతో గడిచిన ఏడేండ్లలో దీపావళి పండుగ టైంలో రెండో సారి పొల్యూషన్ వెరీ పూర్ కండిషన్ను దాటలేదు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 317గా నమోదైనట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ) వెల్లడించింది. భారీ ఎత్తున క్రాకర్స్ కాల్చడంతో పండుగ రోజు అర్ధరాత్రి తర్వాత కొన్ని ప్రాంతాలు పొల్యుషన్ (ఏక్యూఐ 365)లో మునిగిపోయినట్లు తెలిపింది. ఘజి యాబాద్(270), నోయిడా(305), గురుగ్రామ్ ( 307), ఫరిదాబాద్(305) గా నమోదైన ట్లు తెలిపింది.
కిందటేడాదితో కొంత మెరుగు..
పోయినేడు ఏక్యూఐ 382గా నమోదైంది. సివి యర్ ఎయిర్ క్వాలిటీ మార్క్ కు కాస్త దగ్గరలో ఆగిపోయింది. ఈసారి కేవలం 317 దగ్గర నిలిచింది. అలాగే 2020 లో 414, 2091 లో 337, 2018 లో 281, 2017 లో 319, 2016 లో 431 గా ఏక్యూఐ రికార్డైనట్లు సిపిసిబి పేర్కొంది. కాగా, ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ డేటా ప్రకారం.. 24 గంట ల్లో పీఎం2.5 కణ పదార్థాల సాంద్రత సురక్షిత పరిమితుల కంటే 15 రెట్లు ఎక్కువని వెల్లడైంది. ఢిల్లీలో ఫైర్ యాక్సిడెంట్స్ కు సంబంధించి 201 కాల్స్ వచ్చినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు.
