
పర్వతగిరి/సంగెం, వెలుగు: రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్కావడంతో మనస్తాపం చెందిన పాలిటెక్నిక్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లికి చెందిన మొలుగూరి మహేందర్ కూతురు మానస(17) వరంగల్లోని గణపతి ఇంజనీరింగ్ కాలేజీలో సెకండియర్చదువుతోంది. కొద్ది రోజుల క్రితం పరీక్షలు రాయగా ఈ నెల 3న రిజల్ట్వచ్చింది. రెండు సబ్జెక్టులలో ఫెయిలైందని బాధ పడుతుంటే తల్లిదండ్రులు నచ్చజెప్పారు. ఈ నెల 7న ఇంట్లో ఎవరూ లేని సమయంలో మానస చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సంగెం ట్రైనీ ఎస్సై ప్రియదర్శిని చెప్పారు.