భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో సింగరేణిలో బొగ్గు తవ్వకాలకు బ్రేక్ పడుతోంది. గనుల్లోకి వరద నీరు భారీగా చేరుతుండడంతో చెరువులను తలపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఓపెన్‌కాస్ట్ గనుల్లో మంగళవారం మూడు షిఫ్టుల్లో 1,71,992 టన్నుల బొగ్గు తీయాల్సి ఉండగా, కేవలం 92,301టన్నులు మాత్రమే తవ్వారు.
శ్రీరాంపూర్, ఆర్జీ–1, ఆర్జీ–2, భూపాలపల్లి, బెల్లంపల్లి, కొత్తగూడెం ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి భారీగా తగ్గింది. కీలకమైన ఓవర్‌బర్డెన్ పనులకు వానలతో ఆటంకం కలిగింది. సింగరేణి వ్యాప్తంగా13.98లక్షల క్యూబిక్ మీటర్లకు కేవలం 76 వేల క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే తవ్వారు. రైల్వే ద్వారా బొగ్గు రవాణాకు ఎటువంటి ఆటంకం లేకపోవడంతో ఆఫీసర్లు ఊపిరి పీల్చుకున్నారు.

