- బీసీ సంఘాల లీడర్ల హెచ్చరిక
- బషీర్బాగ్లో పొంగులేటి దిష్టిబొమ్మ దహనం
బషీర్బాగ్, వెలుగు: బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి వాకిటి శ్రీహరిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దురుసుగా ప్రవర్తించాడంటూ బీసీ సంఘాల లీడర్లు నిరసన వ్యక్తం చేశారు. బషీర్ బాగ్ చౌరస్తా లో మంత్రి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ , దిష్టిబొమ్మ దహనం చేశారు.
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ మాట్లాడుతూ కేబినెట్మీటింగ్ తర్వాత సెక్రెటేరియట్ లో జరిగిన సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి ఇచ్చిన పేపర్లను చదివిన పొంగులేటి వాటిని దురుసుగా మీద పడేసి అవమానించారన్నారు. బీసీల పట్ల పొంగులేటి వైఖరి సరికాదన్నారు.
గతంలో కూడా పీసీసీ చీఫ్ పై అసత్య ప్రచారాలు చేశారని ఆరోపించారు. తక్షణమే పొంగులేటి మంత్రి శ్రీహరికి క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సి.రాజేందర్ , ఐక్యవేదిక అధ్యక్షుడు జి.అనంతయ్య , రాష్ట్ర కార్యదర్శి అంజి గౌడ్ , విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ శివ యాదవ్ నరేష్ గౌడ్ పాల్గొన్నారు.
