100 రోజుల్లో అమలు చేసి తీరుతం.. టైంపాస్ చెయ్యం: మంత్రి పొంగులేటి

100 రోజుల్లో అమలు చేసి తీరుతం.. టైంపాస్ చెయ్యం: మంత్రి  పొంగులేటి

ఎన్నికల కోడ్ వచ్చే వరకు టైం పాస్ చెయ్యబోమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.  100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చాం.. చేసి తీరుతామన్నారు. ఆరు పథకాల అమలుకు సబ్ కమిటీని ప్రకటించామని చెప్పారు.  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సబ్  కమిటీ ఛైర్మన్ గా ఉంటారని చెప్పారు. ఆరు పథకాలు ప్రజలకు అందించే బాధ్యత  సబ్ కమిటీదేనన్నారు.  

ప్రజాపాలనలో కోటి 25లక్షల అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.   జనవరి 25 వరకు డేటా ఎంట్రీ జరుగుతుందన్నారు. నిజమైన అర్హులను గుర్తించాలనే తమ లక్ష్యమన్నారు.  ప్రతిపక్షాలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని..  కారు కూతలు కూస్తే సహించేది లేదన్నారు.  ప్రతిపక్షాలవి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి..అసత్య ప్రచారాలను కాంగ్రెస్ సహించబోదన్నారు. 

ప్రజాపాలన హామీల అమలకు కేబినెట్ సబ్ కమిటీ

ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సబ్ కేబినెట్ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్ గా ఉండనున్నారు. కమిటీలో సభ్యులుగా  మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉంటారు.  ప్రజలకు ఆరు గ్యారంటీలను చేరువ చేయడం, అర్హులకు పథకాలు అందించడం కోసం ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.

డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు ఐదు గ్యారంటీల కోసం దాదాపు కోటి 25 లక్షలకు పైగా మంది అప్లై చేసుకున్నారు. ప్రభుత్వం ఈ దరఖాస్తులను జనవరి 17 వరకు  ఆన్ లైన్ లో ఎంట్రీ చేయనుంది.