పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

భద్రాచలం, వెలుగు: పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన భద్రాచలం, దుమ్ముగూడెం మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. ముందుగా దుమ్ముగూడెం మండలం బండిరేవులో రూ.200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన, చింతగుప్ప గ్రామం నుంచి బురదమడుగు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ, ములకపాడులో మినీస్టేడియంలో 400 మీటర్ల అథ్లెటిక్​ ట్రాక్​తో కూడిన మినీ ఇండోర్​ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్​రాజ్, సబ్​ కలెక్టర్​ మృణాల్​ శ్రేష్ట, ఏఎంసీ చైర్మన్​ తెల్లం సీతక్క తదితరులు పాల్గొన్నారు. అనంతరం భద్రాచలంలోని భద్రగిరిమార్టును సందర్శించారు. ఆర్గానిక్​ వస్తువులతో పాటు ఆదివాసీలు సేకరించిన అటవీ ఉత్పత్తులను తక్కువ ధరకు మన్నికతో అందిస్తున్న ఐటీడీఏ పీవో బి.రాహుల్​ను మంత్రి అభినందించారు.