
రాజ్యాంగానికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడన్నారు తమిళనాడు బీజేపీ సహాయ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి. పాలనను విడిచి కిలాడి సీఎంగా మారాడన్నారు. కేసీఆర్ కు మొదటి స్థానం అంటే ఇష్టమన్నారు. అందుకే అవినీతిలోనూ కేసీఆర్ ను మొదటి స్థానంలో గుర్తించాలన్నారు సుధాకర్ రెడ్డి. ఖమ్మం బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ పార్టీ రాష్ట్రంలో బలమైన పార్టీ ఎదుగుతుందన్నారు. రాష్ట్రంలో అనేక అక్రమాలు చేస్తున్నారన్నారన్నారు. ఇసుక,మట్టి,గనులు మాఫియా చేస్తున్నరన్నారు.
స్థానిక మంత్రి మంత్రిలాగ లేడన్నారు. .మంత్రి పి.ఏ అక్రమాలకు అడ్డులేదన్నారు. ఫారెస్ట్ అధికారిని సస్పెన్షన్ చేసి మరి అక్రమ మైనింగ్ చేస్తున్నరన్నారు. ఖమ్మం జిల్లా మంత్రి అరాచకాలు ఎక్కువ రోజులు సాగవుని గుర్తిచాలన్నారు. రాజ్యాంగ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు.జర్నలిస్ట్ ఇల్లు ఎటుపోయాయన్నారు. ఖమ్మం జిల్లాలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తోపాటు కేంద్ర మంత్రులు పర్యటన త్వరలో ఉంటుందన్నారు. బీజేపీ పార్టీ కి సింగిల్ డిజిట్ కలిసొస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి: