కేసీఆర్ ఫ్రంట్ ఎప్పటికీ కార్యరూపం దాల్చదు

కేసీఆర్ ఫ్రంట్ ఎప్పటికీ కార్యరూపం దాల్చదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు టీకాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాగూర్. కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారం అయిందని ఆయన విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం కరోనాతో సహా అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. కేసీఆర్ కలలుగంటున్న  ఫ్రంట్ ఎప్పటికీ కార్యరూపం దాల్చదన్నారు ఠాగూర్. కేసీఆర్ దేశవ్యాప్తంగా ఎవరెవర్ని కలుస్తున్నారో ఆ నేతలందరూ తమ జాతీయనేత రాహుల్ గాంధీ తో టచ్ లో ఉన్నారన్నారు. రాష్ట్రంలో పడిపోతున్న తన గ్రాఫ్ ను రక్షించుకునేందుకే కేసీఆర్ ఫ్రంట్ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.

తన పార్టీనే రక్షించుకోలేని పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నారన్నారు. త్వరలో టిఆర్ఎస్ ఖాళీ కాబోతోందన్నారు. టీఆర్ఎస్‌కు చెందిన చాలామంది తొందర్లోనే బిజెపిలో చేరనున్నట్లు సమాచారముందన్నారు ఠాగూర్. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనే సత్తా కేవలం కాంగ్రేస్ కు మాత్రమే ఉందన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రేస్ ను కోరుకుంటున్నారన్నారు. KCR అవినీతి, అక్రమాల చిట్టా మొత్తం కేంద్రం వద్ద ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ బూత్ లెవల్‌లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ విజయవంతంగా జరిగిందన్నారు. బంగారు తెలంగాణ ఫలాలు ఎక్కడా కనిపించడం లేదన్నారు. వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ ఘోరపరాజయం పొందుతుందని కేసిఆర్ కి కూడా తెలుసన్నారు. వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు సాగాలన్నారు.

ఇవి కూడా చదవండి:

పార్టీ ప్రక్షాళన కోసమే డిజిటల్ సభ్యత్వ నమోదు