యువతలో స్ఫూర్తి నింపుతున్న ప్రధాని మోదీ : మెగా రక్తదాన శిబిరంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి

యువతలో స్ఫూర్తి నింపుతున్న ప్రధాని మోదీ : మెగా రక్తదాన శిబిరంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి

ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పధంలో దూసుకెళ్తుందని.. ముఖ్యంగా యువతలో ఉత్సాహం ఉరకలేస్తుందన్నారు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల బీజేపీ నేషనల్ కో ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి. మోదీ పాలనపై యువతలో స్ఫూర్తి నింపుతుందని.. దీనికి నిదర్శనమే ఆయన పుట్టిన రోజున పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించటంగా స్పష్టం చేశారాయన. 

ప్రధాని మోదీ 75వ పుట్టిన రోజును పురస్కరించుకుని కర్నాటక రాష్ట్రం బీదర్ లో నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో పాల్గొన్నారు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల బీజేపీ నేషనల్ కో ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి. వాలంటీర్ల ఉత్సాహం చూస్తుంటే.. మోదీ నాయకత్వంపై వారికి ఉన్న నమ్మకానికి నిదర్శనంగా అభివర్ణించారాయన. 

బీదర్ జిల్లా అధ్యక్షుడు టి.సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా రక్తదాన శిబిరంలో  బీదర్ జిల్లా అధ్యక్షుడు సోమనాథ్ పాటిల్, ఎమ్మెల్యే డాక్టర్ శైలేంద్ర బెల్డాలే, ఎమ్మెల్యే రఘునాథ్ మల్కాపురే, ఎమ్మెల్సీ శ్రీ బాబు అలీ, బీజేవైఎం నాయకులు, మహిళా మోర్చా కేడర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.