- డిప్యూటీ సీఎంకు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అడ్వకేట్ల వెల్ఫేర్ కోసం 2026–27 వార్షిక బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్‌గౌడ్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోరారు.
బుధవారం భట్టిని కలిసి ఎన్నికల మేనిఫెస్టో మేరకు బడ్జెట్ కేటాయింపులు ఉండేలా చేయాలని కోరినట్టు అశోక్‌గౌడ్ చెప్పారు. అత్యవసర వైద్యం, ఇతరత్రా సమస్యలతో సతమతమవుతున్న లాయర్ల కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
