ప్రతిపక్ష నేత హోదా తెచ్చుకో.. చర్చకు సిద్ధం: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రతిపక్ష నేత హోదా తెచ్చుకో.. చర్చకు సిద్ధం: మంత్రి పొన్నం ప్రభాకర్

కేసీఆర్​ నుంచి ప్రతిపక్ష నేత హోదా తెచ్చుకొని లెటర్ తెస్తే, కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చర్చకు తాను సిద్దమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళ వారం గాంధీభవన్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో చర్చ చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా  కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చర్చకు రమ్మన్నది అసెంబ్లీకే. కానీ కేటీఆర్​ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి చర్చకు రమ్మనడం ఏం సభ్యత? అసెంబ్లీలో చర్చ చేస్తే రికార్డవుతుంది. చేతనైతే అసెంబ్లీలో చర్చకు రావాలి” అని సవాల్ విసిరారు. తన ఇంట్లో ఉన్న పంచాయితీ నుంచి  ప్రజల దృష్టి  మళ్లించేందుకు కేటీఆర్ ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

‘‘కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చర్చించేందుకు మా పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు చాలు.. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించే స్థాయి ఆయనది కాదు. మంత్రిగా మరోసారి కేటీ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సవాల్ చేస్తున్నా.. అసెంబ్లీలో చర్చకు వస్తే బనకచర్లపై  తేల్చుకుందాం. కట్టుదిట్టమై న భద్రత ఉండే అసెంబ్లీలో  చర్చ అంటే కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎందుకంత భయం?” అని ప్రశ్నించారు.