
బీఆర్ఎస్ అండతో ప్రభుత్వ శాఖల్లో దొడ్డి దారిన ఉద్యోగాలు పొందిన వారంతా వెంటనే రాజీనామా చేయాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ శాఖలో చాలామంది ఉద్యోగులు దొడ్డి దారిన చొరబడ్డారని ఆరోపించారు. ఈ అంశాన్ని సీఎం దృష్టి కి తీసుకెళ్ళి.. విచారణ చేయాలని కోరుతానన్నారు. తెలంగాణ లో నిజమైన నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కాలన్నారు.
బోయినపల్లి వినోద్ రావు చెల్లి పరీక్ష రాయకుండానే అక్రమంగా ఉద్యోగం పొంది, నెలనెలా జీతం తీసుకున్నారని ఆరోపించారు. దమ్ముంటే ఈ విషయంపై విచారణకు ఆదేశించాలనివినోద్ కు సవాల్ విసిరారు. ముందుగా పోలీస్ కేసు పెడితే అందరి బాగోతం బయట పెడతామని హెచ్చరించారు. ఎంపీ సంతోష్ చెల్లి కూడా భూ నిర్వాసితుల కోటాలో ప్రభుత్వ భూమి తీసుకున్నారని ఆరోపించారు. అలాంటి వారు కూడా భూమి తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో నిజమైన నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కాలని.. అన్ని శాఖల్లో విచారణ చేయాలన్నారు.