ఆర్టీసీ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

ఆర్టీసీ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

హైదరాబాద్, వెలుగు: జుక్కల్ వద్ద శుక్రవారం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్ర్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు డ్రైవర్ మృతి తీవ్రంగా కలిచివేసిందని, గాయపడ్డవారికి వెంటనే మెరుగైన వైద్య సేవలందించాలని  సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్​లో ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి, అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మృతి చెందిన డ్రైవర్ కుటుంబానికి అండగా ఉంటామని, గాయపడ్డ వారికి అధికారులు అండగా నిలవాలని సూచించారు.