ప్రాజెక్టులను కేసీఆర్ దోపిడీ వ్వవస్థగా మార్చారు: మంత్రి పొన్నం

 ప్రాజెక్టులను కేసీఆర్ దోపిడీ వ్వవస్థగా మార్చారు: మంత్రి పొన్నం

కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించబోమని ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. అధికారపక్షం, ప్రతిపతక్షం మధ్య మాటల యుద్ధం నడించింది. ఈ క్రమంలో మంత్రి హరీశ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ కోసం మాజీ సీఎం కేసీఆర్ ఒక్కరే పోరాడలేదన్నారు. నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు కెసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. రాయలసీమ రత్నాల సీమ చేస్తానని ఎందుకు చెప్పారని ప్రశ్నించారు.కృష్ణా అంటే గోదావరి అంటారు.. మరి, గోదావరి నీళ్లు దోచుకోవచ్చా అని ప్రశ్నించారు.

 కృష్ణా అయినా... గోదావరైనా మన వాటా మనకు దక్కాల్సిందేన్నారు. ప్రాజెక్టులను దోపిడీ వ్వవస్థగా కేసీఆర్ మార్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు రానీ మాజీ సీఎం కేసీఆర్.. రేపు నల్గొండకు కూడా పోవద్దన్నారు మంత్రి పొన్నం.

పదేళ్లల్లో కృష్ణా జలాలపై చేసిన తప్పులను బీఆర్ఎస్ నేతలు ఒప్పుకోవాలన్నారు రాజగోపాల్ రెడ్డి. నల్గొండకు తీవ్ర అన్యాయం చేసిన కేసీఆర్.. ఇప్పుడు సభ పెడుతానంటున్నారని ఫైర్ అయ్యారు. ఇవాళ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా.. రేపు సభ కోసం జనాలను బతిమిలాడుతున్నారని ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లలో రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణను చేశారని ఆయన మండిపడ్డారు.

 

Also Read : కోహ్లీ లేకపోవడం సిరీస్‌కే సిగ్గు చేటు