పంత్కు ఓపికుంటే అన్ని మ్యాచ్ లకు తీసుకెళ్తా : రికీ పాంటింగ్

పంత్కు ఓపికుంటే అన్ని మ్యాచ్ లకు తీసుకెళ్తా : రికీ పాంటింగ్

కారు ప్రమాదంలో గాయపడిన టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ కు పంత్ అందుబాటలో ఉండడని  ఢిల్లీ క్యాపిటల్స్ డైరక్టర్ గంగూలీ ఇప్పటికే ప్రకటించాడు. అయితే పంత్ ప్రయాణం చేయడానికి సహకరిస్తే అతన్ని తమతో పాటు మ్యాచ్ లకు తీసుకువెళ్తామని  ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ చెప్పాడు.

పంత్  సేవలను కోల్పోవడం బాధకరమన్న పాటింగ్... అతని లాంటి  సరదా మనిషి డగౌట్‌లో ఉంటే జట్టుకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. పంత్ ప్రయాణించగలిగితే ఐపీఎల్ జరిగినన్ని రోజులు అతన్ని డగౌట్‌లో పక్కనే కూర్చోబెట్టుకుంటామని చెప్పాడు. పంత్ త్వరగా కోలుకుని  మళ్లీ మైదానంలోకి వచ్చి క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నట్లుగా పాటింగ్ తెలిపాడు. 

ఉత్తరాఖండ్లోని రూర్కీలో కారు ప్రమాదంలో రిషభ్ పంత్‌ గాయపడ్డాడు. అతని తలకు రెండు గాట్లతో పాటు మోకాలిలోని లిగమెంట్లలో చీలిక ఏర్పడింది. ఈ గాయాల నుంచి పంత్  కోలుకోవడానికి కనీసం 9 నెలలు పడుతుందని డాక్టర్లు తెలిపారు. అతని మోకాలి లిగమెంట్లకు  ముంబైలోని కోకిలా బెన్‌ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగింది.