
సౌత్, నార్త్ అనే తేడా లేకుండా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది పూజా హెగ్డే. రిజల్ట్ ఎలా ఉన్నా.. ఆమెకు మాత్రం వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. హీరోయిన్‌గా చేస్తూనే, స్టార్ హీరోల చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తోనూ మెప్పిస్తోంది. తాజాగా మరో క్రేజీ చాన్స్ అందుకుంది పూజా. ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ చిత్రంలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అనిరుధ్ కంపోజ్ చేసిన స్పెషల్ సాంగ్‌లో ఎన్టీఆర్, పూజా కలిసి స్టెప్పులు వేయబోతున్నారట.
త్వరలోనే పాట చిత్రీకరణలో పూజా జాయిన్ కానుంది. ఆమె ఇప్పటికే ‘రంగస్థలం’లో చేసిన ఐటమ్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రాగా, ఈ పాటపైనా మంచి అంచనాలు ఉంటాయి. దర్శకుడు కొరటాల శివ తన ప్రతి చిత్రంలోనూ స్పెషల్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. దీనిలోనూ ఈ పాటకు ఓ ప్రత్యేకత ఉంటుందని టీమ్ చెబుతోంది.
ఇక హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్‌కు తోడు పూజా హెగ్డే గ్లామర్ సినిమాకు మరింత అట్రాక్షన్‌గా నిలుస్తుందనిపిస్తోంది. కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.