
రీసెంట్‌గా ‘వాల్మీకి ’ టీజర్ రిలీజయ్యింది. అది చూసినవారికి ఓ అనుమానం వచ్చింది. పూజా హెగ్డే కనిపించలేదేంటి అని. ఆమెను కావాలనే చూపించలేదట. నిజానికి ఒరిజినల్‌లో విలన్ బాబీ సింహాకి హీరోయిన్ ఉండదు. కానీ వరుణ్ పెద్ద హీరో కనుక హీరోయిన్ ఉండాలని పూజతో జోడీ సెట్ చేశారేమో అనుకున్నారంతా. అదేం కాదట. వరుణ్ కి పెయిర్ ఎవరూ ఉండరట. అధర్వ మురళికి మాత్రమే ఉంటుందట. ఆ పాత్రను మృణాళినీ రవి చేస్తోంది. పూజ కోసం డైరెక్టర్ ఓ స్పెషల్ రోల్ క్రియేట్ చేశాడని, అది రిలీజ్ వరకూ రివీల్ చేయరని టాలీవుడ్ టాక్.