కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ప్రముఖ సింగర్ ప్రచారం

 కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ప్రముఖ  సింగర్ ప్రచారం

జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని  సింగర్  నర్సిరెడ్డి(నల్గొండ గద్దర్) కోరారు. అక్టోబర్ 23న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా  మాట్లాడిన ఆయన.. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం యువకుడు, మంచి మనసున్న నవీన్ యాదవ్ ను గెలిపించాలని స్థానిక ఓటర్లకు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే నవీన్ యాదవ్ గెలిస్తే ప్రతీ స్లమ్ ఏరియా అభివృద్ధి చెందుతుందని, ఎక్కడ ఏ సమస్య ఉన్నా దానికి పరిష్కరించేందుకు నవీన్ యాదవ్ కృషి చేస్తారని నర్సిరెడ్డి అన్నారు. బోరబండలో పలు కాలనీల సంక్షేమ సంఘాల అధ్యక్షులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి   నవీన్ యాదవ్ కాంగ్రెస్ కండువా కప్పారు. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. నామినేషన్లు ముగియడంతో ఇక అన్ని పార్టీలు ప్రచారానికి తెరలేపాయి. మూడు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుండగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ లు మాత్రం ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అంతేకాదు జంపింగ్ జిలానీలకు కండువాలు కప్పి పార్టీల్లో చేర్చుకుంటున్నాయి. 

కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. సిట్టింగ్ సీటు దక్కించుకోవాలని బీఆర్ఎస్, జూబ్లీహిల్స్ లో గెలవాలని అధికార పార్టీ, సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ .. 14న కౌంటింగ్ జరగనుంది.