ఎండలు మండిపోతున్నాయి. అందుకే ఉపశమనం కోసం చాలామంది ఐస్‌బాత్ చేస్తుంటారు. మరి ఇంట్లో బాత్ టబ్ లేనివాళ్ల పరిస్థితి ఏంటి? అలాంటివాళ్ల కోసమే ఈ టబ్. దీన్ని న్యూకర్చర్ అనే కంపెనీ తీసుకొచ్చింది. వార్మ్ సోక్ బాత్, ఐస్ బాత్ లాంటివి చేయడానికి ఇది బాగా సరిపోతుంది. వాటర్ టెంపరేచర్ని చాలాసేపు వరకు లాక్ చేసి ఉంచుతుంది.
హై–సెన్సిటివ్ టెంపరేచర్ సెన్సర్ ప్రోబ్ బాత్ టబ్‌లోని వాటర్ టెంపరేచర్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటుంది. ఇది 0 నుంచి 99 డిగ్రీల సెల్సియస్ వరకు గుర్తించగలదు. ఈ బాత్‌టబ్‌ని మడతపెట్టుకోవచ్చు. దీని బరువు కూడా చాలా తక్కువ. కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. స్నానం చేసిన తర్వాత నీళ్లు వదిలేందుకు రెండు రంధ్రాలు ఉంటాయి.
దీన్ని పూర్తిగా ప్లాస్టిక్‌తో తయారుచేశారు. టెంపరేచర్ మారకుండా సాయపడే క్విల్టెడ్ ఇన్సులేటెడ్ మూతతో వస్తుంది. దీని ఆర్మ్‌రెస్ట్‌ని రబ్బరుతో తయారుచేయడం వల్ల చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
