
దోహా: ఫిఫా వరల్డ్ కప్‌లో తన తొలి మ్యాచ్‌కు ముందే పోర్చుగల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో హెడ్‌లైన్స్‌లోకి వచ్చాడు. ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్, ప్రీమియర్ లీగ్ టీమ్ మాంచెస్టర్ యునైటెడ్ నుంచి రొనాల్డో వైదొలిగాడు. పరస్పర అంగీకారంతో కాంట్రాక్టును రద్దు చేసుకున్నట్టు మాంచెస్టర్ ప్రకటించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. రొనాల్డో సైతం ఈ విషయాన్ని ధృవీకరించాడు. మాంచెస్టర్‌తో చర్చించి కాంట్రాక్ట్‌ను ముందుగానే ముగించుకోవాలని అంగీకరించామని చెప్పాడు. రొనాల్డో రెండు పర్యాయాల్లో మాంచెస్టర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2003 నుంచి 2009 వరకు మాంచెస్టర్ టీమ్‌లో సూపర్ స్టార్‌గా వెలుగొందాడు. 2021లో మాంచెస్టర్‌కు రొనాల్డో తిరిగొచ్చాడు. దాదాపు రూ.125 కోట్లతో మాంచెస్టర్‌తో రెండేళ్ల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. కానీ, ఈ ఏడాదిలో రొనాల్డో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.