Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ హౌస్‌లో బిగ్గెస్ట్ ఫైట్.. రోహిత్‌ను టార్గెట్ చేసిన త్రిగుణ్? నెటిజన్ల ఫైర్!

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ హౌస్‌లో బిగ్గెస్ట్ ఫైట్.. రోహిత్‌ను టార్గెట్ చేసిన త్రిగుణ్? నెటిజన్ల ఫైర్!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ లో ప్రస్తుతం సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్ అన్న విధంగా వారి మధ్య రసవత్తరపోరు సాగుతోంది. ప్రతి చిన్న విషయానికీ కంటెస్టెంట్ల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది.  రోజులు గడిచే కొద్దీ గేమ్ కంటే గొడవలే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. ముఖ్యంగా త్రిగుణ్, రోహిత్ మధ్య నడుస్తున్న వార్ ఇప్పుడు హౌస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. లేటెస్ట్ ఎపిసోడ్‌లో చిన్న విషయంతో మొదలైన వీరి వాగ్వాదం ఏకంగా పర్సనల్ అటాక్స్ వరకు వెళ్లడం ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది.

కిచెన్‌లో గిన్నెలు కడిగే బాధ్యత రోహిత్‌కు రావడంతో అసలు రచ్చ మొదలైంది. రోహిత్ గిన్నెలు సరిగ్గా కడగడం లేదంటూ త్రిగుణ్ పదేపదే చెక్ చేయడం, ప్రతి విషయంలోనూ తప్పులు వెతకడం గొడవకు దారితీసింది. గిన్నెలు కనిపించినప్పుడు చెబితే వచ్చి కడుగుతానని రోహిత్ చెప్పినా త్రిగుణ్ వెనక్కి తగ్గలేదు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.

ఇదే సమయంలో రోహిత్ చదువు, మార్కులపై త్రిగుణ్ చేసిన వ్యాఖ్యలకు అతడు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. హౌస్‌లో ఎవరి సామర్థ్యం ఏంటో తెలుస్తుంది.. రూల్స్ చదివి గేమ్ ఆడు అంటూ రోహిత్ స్పందించాడు. దీంతో సహనం కోల్పోయిన త్రిగుణ్.. రోహిత్ బాడీపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు ఎపిసోడ్‌లో చూపించారు. అతని బాడీ స్టెరాయిడ్స్‌తో తయారైందనే అర్థం వచ్చేలా మాట్లాడటంతో వివాదం మరింత ముదిరింది.

ఈ వ్యాఖ్యలపై రోహిత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. గేమ్‌పై విమర్శలు చేయడం వేరని, వ్యక్తిగతంగా బాడీని టార్గెట్ చేయడం సరికాదని చెప్పాడు. ఆ తర్వాత చరణ్‌తో తన బాధను పంచుకున్నాడు. మరోవైపు త్రిగుణ్ 'పిల్ల బచ్చా' అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. అటు నెటిజన్లు సైతం రోహిత్ బాడీపై త్రిగుణ్ చేసిన వ్యాఖ్యలకు మండిపడుతున్నారు. సెలబ్రిటీలైన మాత్రాన సామాన్యులను చులకన చూస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం హౌస్‌లో సెలబ్రిటీలు, కామనర్స్ మధ్య పోరు మరింత రసవత్తరంగా మారుతున్న వేళ.. త్రిగుణ్-రోహిత్ వివాదం ఈ సీజన్‌లో మరో పెద్ద కాంట్రవర్సీగా మారింది. మరి వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ఈ పర్సనల్ కామెంట్స్‌పై త్రిగుణ్‌ను ఎలా ప్రశ్నిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.