గర్భాశయం అంటే మహిళల్లోనే కదా ఉండేది. గర్భదారణతో మాతృత్వం కేవలం స్త్రీలకే సాధ్యం. అయితే అదే గర్భాశయం పురుషుల్లోనూ ఉంటే.. అది వింతే కదా. అలాంటి వింతఘటననే ఇది. పిల్లలు పుట్టడం లేదని ఆసుపత్రికి వెళ్లిన యువకునికి గర్భాశయం ఉందని తెలిసి డాక్టర్లు షాకయ్యారు. గర్భాశయం ఉంటే అతడు గర్భం దాల్చే అవకాశం ఉంటుందా..? అనే ప్రశ్న చాలా మందిలో వస్తుంటుంది. ఆ వివరాలన్నీ తెలుసుకుందాం.
ఢిల్లీలో ఒక 26 ఏళ్ల యువకుడిలో మహిళలకు ఉన్నట్లుగా గర్భాశయం, ఫెలోపియన్ నాళాలు ఉండటం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. డాక్టర్ సుశీల్ ఖర్బందా ప్రకారం.. మహిళల్లో ఉండే గర్భాశయం ఉన్నప్పటికీ పురుషుడి లక్షణాలే ఉన్నట్లు చెప్పారు. పిల్లలు ఎందుకు కావటం లేదని పరీక్షిస్తే అసాధారణ పద్ధతిలో అతడికి ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉన్నట్లు చెప్పారు డాక్టర్లు.
యువకుడిలో ఉన్న అసాధారణ గర్భాశయం, ఫెలోపియన్ నాళాలలను సర్జరీ ద్వారా తొలగించారు రాజౌరీ గార్డెన్ లోని ఆర్జీ హాస్పిటల్ యూరాలజిస్ట్ డా.సుశీల్ ఖర్బందా. మొదట పిల్లలు కలగటం లేదని ఆసుపత్రికి వచ్చిన యువకుడిని పరీక్షించడగా అసాధారణ కండిషన్స్ ఏవీ కనబడలేదని డాక్టర్ చెప్పారు. అతనిలఅో అన్ని పురుష లైంగిక లక్షణాలు సవ్యంగానే ఉన్నట్లు చెప్పారు.
అయితే వృషణ కోశంలో వృషణాలు (టెస్టీస్) లేనట్లు పరీక్షల ద్వాదా తేలింది. అదే విధంగా వీర్య పరీక్షలో.. వీర్యం లేనట్లుగా డాక్టర్లు చెప్పారు. వైద్య పరిభాషలో ఈ స్థితిని అజూస్పెర్మియా అంటారు. యువకుడి కండిషన్ చూసి క్రోమోజోమ్ ల పరీక్ష, హార్మోన్ల పరీక్షలు చేశారు.
స్కానింగ్లో ఏం తేలింది?
క్రోమోసోమల్ టెస్టులో యువకుడు ఎక్స్ వై (XY) పురుష క్రోమోసోమ్ ల ప్యాటర్న్ ఉన్నట్లు గుర్తించారు. అయితే అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ స్కానింగ్ లో యూటెరస్ (గర్భాశయం) ఏర్పడినట్లు తేలింది. మరో విషయం ఏంటంటే టెస్టీస్ బయట లేకుండా.. శరీరంలో లోపల ఉండటం ఆశ్చర్యకరమైన విషయం.
ALSO READ : ఆయుధాలు, బయో వెపన్స్ తయారీకి AI వాడకుండా ఆపాం
ఇది చాలా రేర్ కండిషన్ అని డాక్టర్లు చెబుతున్నారు. దీనిపై పూర్తి క్లారిటీ కోసం మరిన్ని టెస్టులు చేయనున్నట్లు డాక్టర్లు తెలిపారు. పర్సిస్టెంట్ ఎంలెరియన్ డక్ట్ సిండ్రోమ్ (PMDS) అనే సిండ్రోమ్ ద్వారా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని డా.చిరాగ్ భండారి తెలిపారు.
PMDS స్థితి రేర్ గా ఉంటుందని.. ప్రపంచంలో ఇప్పటి వరకు 300 లోపు మాత్రమే కేసులు నమోదైనట్లు డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా పురుషుల్లో టెస్టీస్ ద్వారా యాంటీ ఎంలేరియన్ హార్మోన్ విడుదల అవుతుంది. ఇది విడుదల కాకపోతే పరిస్థితి ఇలాగే ఉండిపోతుందని చెబుతున్నారు.
గర్భాశయంతో పాటు టెస్టీస్ తొలడింపు:
ఈ కేసులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. గర్భాశయం తో పాటు టెస్టీస్ ను ల్యాప్రోస్కోపీ సర్జరీ ద్వారా తొలగించారు డాక్టర్లు. అదే విధంగా గర్భాశయాన్ని, ఫాలోపియన్ ట్యూబ్స్ ను కూడా తొలగించారు వైద్యులు. అలాగే ఉంచితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
