బీసీసీఐ దెబ్బకి టీమిండియా నాశనం.. ప్లేయర్లను చెరకుగడలా పిండేస్తున్నారు?.. గవాస్కర్ గరం!

బీసీసీఐ దెబ్బకి టీమిండియా నాశనం.. ప్లేయర్లను చెరకుగడలా పిండేస్తున్నారు?.. గవాస్కర్ గరం!

టీమిండియా వరుసగా ఐసీసీ టోర్నీల్లో విఫలం కావడం, స్టార్ ఆటగాళ్లు విపరీతంగా గాయాల బారిన పడటం వెనుక ఉన్న అసలు నిజాన్ని భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ బట్టబయలు చేశారు. ఇండియన్ టీమ్ నిరంతర సిరీస్‌లతో రెస్ట్ లేకుండా ప్లేయర్లను పిండేస్తున్న బీసీసీఐ (BCCI) నిర్లక్ష్య వైఖరిని ఆయన తీవ్ర స్థాయిలో ఎండగట్టడం ఇప్పుడు చర్చకు దారితీసింది.

ప్లేయర్లు చెరకుగడలు కాదు: 

ఇండియన్ ప్లేయర్స్ వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ గురించి సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్లేమీ యంత్రాలు కారు.. చివరి బొట్టు దాకా పిండి పిప్పి చేయడానికి వాళ్లు చెరకుగడలు అంతకంటే కారంటూ ఘాటుగా విమర్శించారు. విశ్రాంతి లేకుండా మ్యాచ్‌లు ఆడించడం వల్లే ప్రధాన ప్లేయర్లు క్రమంగా గాయపడుతున్నారని, బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా కూడా ఈ నిజాన్ని అంగీకరించక తప్పలేదన్నాడు. 

మూడు జట్లనేది ఒక భ్రమ మాత్రమే: 

భారత్ దగ్గర ఒకేసారి మూడు జట్లను దింపేంత బెంచ్ స్ట్రెంగ్త్ ఉందనే ప్రచారాన్ని గవాస్కర్ పూర్తిగా తోసిపుచ్చారు. అది కేవలం కాగితాలపై చెప్పుకోవడానికి మాత్రమే బాగుంటుందని, నిజానికి ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవడానికి కూడా ప్రస్తుతం ఉన్న ప్రధాన టీమిండియా జట్టు సరిపోవడం లేదని అసలు నిజాన్ని బట్టబయలు చేశాడు. 

ALSO READ : వినేష్ ఫోగట్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్

డొమెస్టిక్ క్రికెట్‌కు దక్కని ప్రాధాన్యం: 

కేవలం జాతీయ జట్టుపైనే పూర్తి దృష్టి పెట్టి, దేశవాళీ (డొమెస్టిక్) వ్యవస్థను నిర్లక్ష్యం చేయడంతో ప్రపంచస్థాయి మ్యాచ్ విన్నర్లు తయారవడం లేదని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. టీమిండియా అనేది భారత క్రికెట్ వ్యవస్థ నుంచి వచ్చిన ఒక ప్రాడక్ట్ మాత్రమే తప్ప, అదే మొత్తం భారత క్రికెట్ కాదని బోర్డుకు సూచించాడు. 

2027 ఐసీసీ క్యాలెండర్‌పైనే ఆశలు: 

2027 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP) క్యాలెండర్ రూపకల్పనలోనైనా బీసీసీఐ కళ్లు తెరవాలని సన్నీ హెచ్చరించారు. ప్లేయర్ల శారీరక, మానసిక ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని మ్యాచ్‌ల సంఖ్యను తగ్గించకపోతే రాబోయే రోజుల్లో భారత క్రికెట్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేశారు.