మేం సినిమాలోనే హీరోలం.. ఆయన రియల్ హీరో

మేం సినిమాలోనే హీరోలం.. ఆయన రియల్ హీరో

సీఎం జగన్ పైన ఎవరైనా నిందలు వేస్తే భూమిలోకి  పాతుకుపోతారన్నారు సినీ నటుడు పోసాని మురళి కృష్ణ. శుక్రవారం తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిశారు పోసాని. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..తమ కుటుంబం కోవిడ్ సమయంలో ఆస్పత్రిలో ఉంటే సీఎం జగన్ దంపతులు సాయం చేశారని..అందుకు కృతజ్ఞతలు చెప్పేందుకే జగన్ ను కలిశానన్నారు. తాము సినిమాలోనే హీరోలమని.. జగన్ రియల్ లైఫ్ లో హీరో అని అన్నారు. జగన్ రియల్ హీరో కాబట్టే 151 సీట్లలో గెలిచారన్నారు. అలాంటి జగన్ పై ఎవరైనా నిందలు వేస్తే భూమిలోకి పాతుకుపోతారన్నారు. భీమ్లా నాయక్ సినిమాను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటుందనడం కరెక్ట్ కాదన్నారు. ప్రభుత్వం ఇబ్బందిపెట్టినట్టు ఏమైనా ఆధారాలుంటే చూపెట్టాలన్నారు. భీమ్లా నాయక్ సినిమా టికెట్లను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. బెనిఫిట్ షోలకు కూడా అనుమతివ్వలేదు. తెలంగాణలో ఐదో షోకి అనుమతిచ్చింది ప్రభుత్వం. అయితే ఏపీ ప్రభుత్వం కావాలనే భీమ్లానాయక్ సినిమాపై ఆంక్షలు విధిస్తుందని పవన్ అభిమానులు, కొందరు టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఉక్రెయిన్‎కు మద్దతివ్వొద్దన్నారు.. కానీ మేమిస్తాం

వార్‌పై రష్యాకు వ్యతిరేక తీర్మానం.. ఓటేయని భారత్