తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం

తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం

రాగల మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఏపీ, పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 4.5 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల వరకు ద్రోణి ఆవరించి ఉంది. ఈ ప్రభావంతో రాగల రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో ఇవాళ నైరుతి, తూర్పు, దక్షిణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అలర్ట్ గా ఉండాలని హెచ్చరించారు.