PGIMERలో ఉద్యోగాలు.. అర్హత, అనుభవం ఉంటే చాలు.. ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్..

PGIMERలో ఉద్యోగాలు.. అర్హత, అనుభవం ఉంటే చాలు.. ఇంటర్వ్యూ  ద్వారా సెలక్షన్..

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు అప్లికేషన్లు కోరుతున్నది.  

పోస్టుల సంఖ్య: 02 (జేఆర్ఎఫ్ 01, డేటా ఎంట్రీ ఆపరేటర్01)

ఎలిజిబిలిటీ: జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుకు బయోటెక్నాలజీ/ లైఫ్ సైన్సెస్/ ఎంపీహెచ్/ సోషల్ అండ్ బిహేవియరల్ సైన్సెస్ మొదటి తరగతిలో డిగ్రీ ఉత్తీర్ణత లేదా బయోటెక్నాలజీ/ లైఫ్ సైన్సెస్/ సోషల్ అండ్ బిహేవియరల్ సైన్సెస్​లో రెండో తరగతిలో మాస్టర్స్ డిగ్రీతోపాటు పీహెచ్​డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. 

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: సెప్టెంబర్ 4. 

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు pgimer.edu.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.