బాలింత మృతిలో మా తప్పు లేదు: పోలీసులు

బాలింత మృతిలో మా తప్పు లేదు: పోలీసులు
  •  ముమ్మాటికీ పోలీసుల నిర్లక్ష్యమే: బాధితులు

ఉప్పల్​/ఘట్​కేసర్, వెలుగు: ఉప్పల్​లో ఆదివారం జరిగిన ఐపీఎల్​మ్యాచ్​కారణంగా ట్రాఫిక్​జామ్ ఏర్పడి అంబులెన్స్​గంటల పాటు నిలిచిపోయి ఓ బాలింత మృతి చెందిందన్న వార్తను స్థానిక ట్రాఫిక్​ పోలీసులు ఖండించారు. బిష్ణ అనే బాలింత మృతికి సంబంధించి తమ తప్పు లేదన్నారు. మ్యాచ్​జరిగిన రోజు అంబులెన్స్​సాయంత్రం 6:30 గంటలకు బీబీనగర్​ఎయిమ్స్​ వద్ద స్టార్టయ్యి రాత్రి 7:28కి ఉప్పల్​ఎక్స్​రోడ్స్​ కు వచ్చిందన్నారు.

డ్యూటీలో ఉన్న సిబ్బంది సర్వే ఆఫ్​ ఇండియా జంక్షన్​లో అంబులెన్స్​ను గమనించి ఉప్పల్​వైపు వెళ్లే దారిలో రాంగ్​రూట్​లో పంపగా 7:49 వరకే ఏక్​మినార్​జంక్షన్​దాటి వెళ్లిపోయిందన్నారు. అయితే, బాధిత కుటుంబం మాత్రం ఉప్పల్​ట్రాఫిక్​జామ్​లో గంటల పాటు ఇరుక్కుపోవడంతోనే బిష్ణ ప్రాణాలు కోల్పోయిందని, దీనికి ముమ్మాటికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు.