50 గిగావాట్లు పెరిగిన కరెంట్ ఉత్పత్తి సామర్థ్యం.. పవర్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో కొత్త రికార్డ్‌‌‌‌

50 గిగావాట్లు పెరిగిన కరెంట్ ఉత్పత్తి సామర్థ్యం.. పవర్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో కొత్త రికార్డ్‌‌‌‌

న్యూఢిల్లీ: పవర్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో కొత్త రికార్డ్ నమోదైంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  (ఏప్రిల్ నుంచి జనవరి వరకు) చరిత్రలోనే అత్యధిక సామర్థ్యాన్ని ఇండియా జోడించింది. పవర్ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ కాలంలో మొత్తం 52,537 మెగావాట్ల (50.53 గిగావాట్ల) ఉత్పత్తి సామర్థ్యం అన్ని వనరుల నుంచి యాడ్ అయ్యింది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) సాధించిన 34 గిగావాట్ల  రికార్డును దాటింది. 

ఈ కొత్త సామర్థ్యంలో 39.65 గిగావాట్లు రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి  వచ్చాయి. అందులో 35 గిగావాట్లు సోలార్ పవర్, 4.61 గిగావాట్లు విండ్ పవర్ నుంచి ఉన్నాయి. ఈ ఏడాది  జనవరి 31 నాటికి భారతదేశం మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 520.51 గిగావాట్లు కాగా,  ఇందుల్ ఫాసిల్ ఫ్యూయల్ (బొగ్గు, చమురు) ఆధారిత సామర్థ్యం 248.54 గిగావాట్లు, రెన్యూవబుల్, నూక్లియర్ ఎనర్జీ వాటా , 271.97గిగావాట్లు.