ఏప్రిల్ 12 కల్లా పంపు సెట్ల రిపేర్లు పూర్తి చేయాలె: సందీప్ కుమార్

ఏప్రిల్ 12 కల్లా పంపు సెట్ల రిపేర్లు పూర్తి చేయాలె: సందీప్ కుమార్
  •    మిషన్ భగీరథపై పీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రివ్యూ
  •     సివిల్ ఏజెన్సీ కంపెనీలతో సమావేశం 

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలోని ప్రతి ఇంటికి తాగు నీరు అందించే బాధ్యత ప్రభుత్వానిదని పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. శనివారం ఆయన ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ ఆఫీస్ లో సీఈలు, ఎస్ఈలు, స్కీమ్ ఆపరేట్ చేస్తున్న మేఘా, ఎన్సీసీ, ఎల్ అండ్ టీ, రాఘవ కన్ స్ర్టక్షన్స్ , ప్రతిభ ఇండస్ర్టీస్ వంటి పలు సివిల్ ఏజెన్సీ కంపెనీల ప్రతినిధులతో  రివ్యూ చేపట్టారు. ఇంటింటికి తాగు నీరు అందించే క్రమంలో  పంపుసెట్లు, పైప్ లైన్లు, విద్యుత్ సరఫరాలో చిన్న చిన్న మరమ్మతులు ఉంటే వెంటనే చేపట్టాలని సూచించారు.

ఈ నెల 12 కల్లా అన్ని మరమ్మతులను పూర్తి చేయాలని అధికారులు, కంపెనీలను ఆదేశించారు.  ఈ మరమ్మతులు ఎక్కడ అవసరం ఉన్న వివరాలను ఆయా కంపెనీలు సీఈలకు  అందచేయాలని స్పష్టం చేశారు. రిపేర్లకు సంబంధించి స్పేర్ పార్ట్స్ ను అందుబాటులో ఉంచాలని తెలిపారు.